ఆటో డ్రైవర్ల ఎల్పీజీ కష్టాలు కళ్ళకి కనిపించటం లేదా?

by velandi.Saikiran |

ఆటో డ్రైవర్ల ఎల్పీజీ కష్టాలు బీఆర్ఎస్, బీజేపీ నాయకుల కళ్ళకి కనిపించటం లేదా? అని సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.

ఆటో డ్రైవర్ల ఎల్పీజీ కష్టాలు కళ్ళకి కనిపించటం లేదా?
X

రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎల్పీజీ బంక్ ల ముందు రోజుల తరబడి పడిగాపులు

ఆటో డ్రైవర్ల ఎల్పీజీ కష్టాలు బీఆర్ఎస్, బీజేపీ నాయకుల కళ్ళకి కనిపించటం లేదా?

వారిని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలి..రాష్ట్రం అండగా ఉంటుంది

: టీపీసీసీ మీడియా కమిటి చైర్మన్, సామ రామ్మోహన్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఎల్పీజీ బంక్ ల ముందు వందలాది ఆటోలు క్యూ లో ఉన్నాయని, ఆటో డ్రైవర్లు ఎల్పీజీ బంక్ ల ముందు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు...ఆటో డ్రైవర్ల ఎల్పీజీ కష్టాలు బీఆర్ఎస్, బీజేపీ నాయకుల కళ్ళకి కనిపించటం లేదా? అని టీపీసీసీ మీడియా కమిటి చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకం ప్రారంభించినప్పుడు ఆటోడ్రైవర్లకు నష్టాలు అంటూ ఆటోలు ఎక్కి సెల్ఫీ వీడియోలు తీసుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ఆయన నిలదీశారు. ఎల్పీజీ లేకపోతే ఆటోలు నడవవు అన్న సంగతి బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు తెలియదా? వారికి ఆటో అన్నల కష్టాలు కనిపియ్యటం లేదా ? లేకపోతే బీఆర్ఎస్ కి బీజేపీ మీద ఉన్న ప్రేమ, భక్తి అడ్డు వస్తున్నాయా? అని సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం మరో సారి బయటపడిందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో 95,000 ఎల్పీజీ ఆటో లు ఉన్నాయని, ఎల్పీజీ సరఫరా బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది..బీజేపీ నాయకులు దీనిపై స్పందించాలని సామ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సరఫరాలో లోపం లేకుంటే ఈ రోజు రాష్టం లో ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? దాదాపు లక్ష కుటుంబాల బతుకుతెరవు బజారున పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా సమస్య లేదు అని చెప్తోందని, కోవిడ్ టైంలో అర్ధాంతరంగా లాక్ డౌన్ చెసి ప్రజలను ఇబ్బంది పెట్టారు...నేడు అంతా బాగుందని ఇబ్బంది పెడుతున్నారని సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసేదాకా బీజేపీ ప్యాచ్ వర్క్ చేసుకుంటూ పోదాం అని చూస్తోందని, వాస్తవాలు బీజేపీ నేతలు ప్రజలకి చెప్పాలి..ముందస్తు చర్యలతో ప్రజలని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల జీవన ఉపాధి నిలబెట్టేందుకు కేంద్రం ముందుకు రావాలి..వారి పట్ల ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సామ రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story