ఉపాధి హామీ పథకం తీసేయాలని బీజేపీ కుట్ర: సామ రామ్మోహన్ రెడ్డి

by Ajay Maddhiboyina |

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తీసేయడం కాదు.. పథకమే తీసేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని టీపీసీసీ మీడియా మరియు కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు.

ఉపాధి హామీ పథకం తీసేయాలని బీజేపీ కుట్ర: సామ రామ్మోహన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తీసేయడం కాదు.. పథకమే తీసేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని టీపీసీసీ మీడియా మరియు కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఉపాధి హామీ పథకంలో పని చేసే వారందరూ హిందువులే.. నాటి బ్రిటిషర్లు, నేటి బీజేపీ నేతలు తప్పా ప్రపంచంలో అందరూ గాంధీని కీర్తిస్తారని ఆయన మండిపడ్డారు. శనివారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రామరాజ్యం గ్రామ స్వరాజ్యమే గాంధీ సిద్ధాంతమని, గాంధీని హత్య చేసినప్పుడు ఛాతీలో బుల్లెట్లు తగిలినా హేరామ్ అంటూనే నేలకొరిగారన్నారు. హిందువులపై బీజేపీ కుట్ర చేస్తోందని, భగవద్గీతను నమ్మే గాంధీపై బీజేపీ నేతలకు ఇంత కక్ష ఎందుకో? అని సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.

బీజేపీ నేతలకు గాంధీ పేరు ఏం అడ్డం వచ్చింది, గాంధీ పేరును మార్చాలనే ఆలోచన వచ్చేది బ్రిటిష్ వారికే అని విమర్శించారు. తెలంగాణలో ఉపాధి హామీ కోసం 53 లక్షల మంది జాబ్ కార్డు హోల్డర్లు ఉన్నారు.. తెలంగాణలో 53 కోట్ల పనిదినాలు ఇవ్వాల్సి ఉంది.. తెలంగాణకి అన్యాయం చేస్తూ గత సంవత్సరం 12 కోట్ల పనిదినాల నుండి కేవలం 6.5 కోట్ల పని దినాలకు కుదించారని సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ లెక్కన వంద రోజుల గ్యారెంటీ పని ప్రకారం.. తెలంగాణలో ఒక్కొక్కరికి కేవలం 12 రోజుల పని వస్తుంది.. మోడీ కొత్త చట్టంలోని 125 రోజుల గ్యారెంటీ పని దినాల ప్రకారం తెలంగాణలో కేవలం 10 రోజులు మాత్రమే పని ఇవ్వగలరని ఆయన తెలిపారు. కొత్త చట్టం ప్రకారం తెలంగాణలో 40 శాతం భారాన్ని వేస్తూ కేంద్రం చేతులు దులుపుకుందని, బీజేపీ రాజకీయాలతో ఆ పార్టీని అయోధ్యలో ఒడగొట్టారని, బీజేపీ అసలు రంగు బయటపెట్టి బజారుకు ఈడుస్తామని రామ్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Next Story