- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR, కేజ్రీవాల్ భేటీకి అసలు కారణం అదే: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
by Satheesh |
సీఎం కేసీఆర్‌తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్‌తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు గురించి చర్చించడానికే వీరు భేటీ అవుతున్నారని ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన పొన్నాల.. కేజ్రీవాల్ పక్కనే ఉండే అన్నా హాజారే ఎటుపోయారని ప్రశ్నించారు.
తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని.. ప్రజల దృష్టి మళ్లించడానికే రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోడీ జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే నల్లధనం తీసుకువస్తానని మోడీ చెప్పారని ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. పార్లమెంట్‌పై నమ్మకం లేని వ్యక్తికి కొత్త పార్లమెంట్ భవనం అయితే ఏంటి పాత పార్లమెంట్ భవనం అయితే ఏంటని ప్రశ్నించారు.
Next Story






