- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనిషివా.. బీజేపీ నాయకుడివా..? కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ ఘాటు వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ స్పందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ (Mettu Saikumar) స్పందించారు. ఈ మేరకు శుక్రవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌కి ట్రైనింగ్ అవసరమని తీవ్ర విమర్శలు చేశారు. పదే పదే కాంగ్రెస్ పార్టీ (Congress) మీద విరుచుకు పడటం సరికాదని సూచించారు. ముందు మీ బీజేపీలో జరిగే అంతర్గత విబేధాల మీద దృష్టి పెట్టండి.. అంటూ విమర్శించారు. ఏది పడితే అది మాట్లాడి కేంద్ర మంత్రిగా ఉన్న మీ పరువు తీసుకోకండి.. అని హితువు పలికారు. మీ నాయకత్వాన్ని మీ పార్టీ వాళ్ళు, మీ 8 మంది ఎమ్మెల్యేలే పట్టించుకోవడం లేదన్నారు. మీకు రాజకీయ శిక్షణ కావాలంటే గాంధీ భవన్‌లో ఇస్తాం.. అని తీవ్ర విమర్శలు చేశారు. ముందు 8 మంది బీజేపీ (Telangana BJP) ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో రాకుండా చూసుకో.. అంటూ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని, బీజేపీలో అజ్ఞానులు కోకొల్లలుగా ఉన్నారని ఫైర్ అయ్యారు. నేడు మనిషివా.. బీజేపీ నాయకుడివా..? అన్న విధంగా పరిస్థితి ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.






