పండుగపూట టీ.కాంగ్రెస్‌లో కల్లోలం.. ఇద్దరు మంత్రులపై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-20 11:16:10  IST  )

దీపావళి పండుగపూట తన మనసులోని ఆవేదనంతా తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(T. Jeevan Reddy) బయటపెట్టారు.

పండుగపూట టీ.కాంగ్రెస్‌లో కల్లోలం.. ఇద్దరు మంత్రులపై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి పండుగపూట తన మనసులోని ఆవేదనంతా తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(T. Jeevan Reddy) బయటపెట్టారు. సోమవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను మానసిక హింసకు గురికావడానికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లే కారణం అని సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఇద్దరి వల్ల రోజూ ఎంతో క్షోభను అనుభవిస్తున్నాను అని ఆవేదన చెందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నన్ను మేకలా బలిచ్చారని కీలక వ్యా్ఖ్యలు చేశారు. తనకు ఏ పదవులు అవసరం లేదని.. ఇకనుంచి కార్యకర్తలను కాపాడుకోవడమే తన పని అని అన్నారు. పార్టీలో పార్టీ ఫిరాయించి వచ్చినోడికి ప్రాధాన్యత ఇస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి ఉన్న వారిని పట్టించుకోరా? ఆవేదన చెందారు. పార్టీ ఫిరాయించినోడికి ఇప్పటికీ సభ్యత్వం లేదంటూ పరోక్షంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌(MLA Sanjay)పై జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో అర్థం కావడం లేదు.. పార్టీ ఫిరాయించినోడు చెప్తేనే పనులు చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు.

Next Story