కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్

by GSrikanth |

తెలంగాణలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి కాంగ్రెస్‌తో సహా ఏ పార్టీకి లేదని, రాష్ట్రంలో హంగ్

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి కాంగ్రెస్‌తో సహా ఏ పార్టీకి లేదని, రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశం ఉంటుందన్న కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై సొంత పార్టీలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని ఇలాంటి చర్యలు మంచివి కావని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులపై వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో కార్యకర్తలు ఎంతో శ్రమించి పని చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్న తరుణంలో ఇలాంటి మాటలు కార్యకర్తలను గందరగోళంలో పడేస్తాయని, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా మాట్లాడడం సబబు కాదన్నారు.

తొమ్మిది ఏళ్లుగా కార్యకర్తలు ఎంతో శ్రమిస్తున్నారు. పొత్తులు ఉండవని వరంగల్ సభలోనే రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చినప్పటికీ కోమటిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఎలాంటి సందేహాలకు లోనవకుండా ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే వైపు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Next Story