- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM స్థాయి వ్యక్తితోనే నాకు పోటీ.. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్(Sanjay)పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి(Jeevan Reddy) మరోసారి విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్(Sanjay)పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి(Jeevan Reddy) మరోసారి విమర్శలు చేశారు. మంగళవారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తారా? అని ప్రశ్నించారు. సంజయ్‌కి మా కంటే ఎక్కువ అనుభవం ఉందా? అని సీరియస్ అయ్యారు. పదేళ్ల BRS అరాచకాలపై పోరాడి.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామని అన్నారు. సీఎం స్థాయి వ్యక్తితోనే నాకు పోటీ ఉంటుందని జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు అభివృద్ధిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోటీ పడ్డా అని జీవన్ రెడ్డి గుర్తుచేశారు.
జీవన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. అధిష్టానం తక్షణమే స్పందించి సర్దిచెబితే.. సమస్య సర్దుమణిగే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, మొన్నటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డికి కావాలనే సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసే అవకాశమివ్వలేదని.. పార్టీలో జీవన్ రెడ్డిపై కుట్ర జరుగుతోందని ఆయన వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు.






