- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ భార్య ఫోన్ ట్యాపింగ్ చేసే స్థితికి దిగజారలేదు.. పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫహీం ఫైర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫోన్ ట్యాపింగ్ (phone tapping) చేయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ తవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో కాంగ్రెస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాజాగా కాంగ్రెస్ నేత, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం (Food Corporation Chairman Fahim) గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హాట్ కామెంట్స్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ (Eatala Rajendar) వల్ల అనేక సమస్యలు ఎదురవడంతో పాడి కౌశిక్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన వివరించారు. నైట్ టైమ్‌లో తిరగడం ఒక్క మీ యువరాజుకే అలవాటు.. గతంలో సెక్యూరిటీ లేకుండా ఫిలింనగర్‌లో అర్ధరాత్రి తిరిగేది మీ కేటీఆరే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. లొంగ తీసుకోవడం, వంగ తీసుకునే కల్చర్ బీఆర్ఎస్ ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారం అడ్డం పెట్టుకోని తండ్రి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మీడియాను లొంగ తీసుకుంటే.. కొడుకేమో గ్లామర్‌ను లొంగ తీసుకున్నారని ద్వజమెత్తారు.
పబ్, ఫామ్‌హౌస్ కల్చర్ కేటీఆర్‌కే వర్తింస్తుందన్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ వ్యవహారంలో వైట్ ఛాలెంజ్ కి రమ్మంటే తోకముడిచి పారిపోయింది కేటీఆర్ అని విమర్శించారు. కేటీఆర్ కారు డ్రైవర్‌గా కౌశిక్ రెడ్డి మారి అనేక చర్యలు పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయని అన్నారు. నీ ఫోన్, మీ భార్య ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు మాపై అనుమాన పడుతున్నావు.. అంత నీచమైన స్థితికి తాము దిగజారలేదన్నారు. నువ్వు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నావు కాబట్టి నీ ఫోన్ ట్యాప్ చేసి ఉంటారు.. పోయి కేటీఆర్‌ను అడుగు ‘నా ఫోన్, నా భార్య ఫోన్ ట్యాపింగ్ చేశావా?’ అని కౌశిక్ రెడ్డికి సూచించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జడ్జీలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, హీరోయిన్స్ ఫోన్‌లను ట్యాపింగ్ చేసినట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిందని అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఫిక్సర్ అని, గతంలో రంజీ మ్యాచ్‌లో ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారని గుర్తుకుచేశారు. ఐపీఎల్ కంటే ముందు ఐసీఎల్ అని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ మొదలు పెడితే.. అందులో పాకిస్తానీలతో చేతులు కలిపి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఫహీం హెచ్చరించారు.






