బెంగళూరులో సమావేశం.. తెలంగాణ నుంచి ఏడుగురికి అవకాశం

by Gantepaka Srikanth |

కర్ణాటకలోని బెంగళూరు(Bengaluru) వేదికగా కాంగ్రెస్(Congress) పార్టీ కీలక సమావేశం నిర్వహించబోతోంది.

బెంగళూరులో సమావేశం.. తెలంగాణ నుంచి ఏడుగురికి అవకాశం
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని బెంగళూరు(Bengaluru) వేదికగా కాంగ్రెస్(Congress) పార్టీ కీలక సమావేశం నిర్వహించబోతోంది. మంగళవారం, బుధ వారాల్లో ఏఐసీసీ(AICC) బీసీ సలహా మండలి సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఏడుగురికి ఆహ్వానం అందింది. తెలంగాణలో అమలు చేసిన బీసీ కులగణన, 42 శాతం రిజర్వేషన్లపై సమావేశంలో మాట్లాడనున్నారు. సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల కీలక నేతలు రానున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సమావేశానికి నాయకత్వం వహిస్తారు. ఈ బీసీ మండలిలో నలుగురు మాజీ సీఎంలు సహా 24 మంది సభ్యులు ఉన్నారు.

తెలంగాణ నుంచి :

ఈ సమావేశాలకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రాష్ట్రం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, వీ.హనుమంతరావులు వెళ్లనున్నారు.

Next Story