- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలింది : హరీష్ రావు
ఢిల్లీ ఎన్నిక(Delhi Elections)ల్లో కాంగ్రెస్(Congress) కు గాడిద గుడ్డు(Donkey Egg) మిగిలిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) ఎద్దేవా(Mockery చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ ఎన్నిక(Delhi Elections)ల్లో కాంగ్రెస్(Congress) కు గాడిద గుడ్డు(Donkey Egg) మిగిలిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) ఎద్దేవా(Mockery చేశారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పాత్ర అమోఘమంటూ వ్యంగ్యాస్త్రా(Satires)లు వేశారు. ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన మీకు ఓట్లు పడతాయా? అని వారిని ప్రశ్నించారు. మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందని.. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమాగం చేసిన కులగణన మీకు బెడిసికొట్టిందని హరీష్ రావు కీలక వ్యా్ఖ్యలు చేశారు
. ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణను మళ్ళీ నిర్వహించండని.. అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడండని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేసుకోండని హితవు పలికారు. లేదంటే మీరు ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని హెచ్చరించారు. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ మీకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హరీష్ రావు పేర్కొన్నారు.
కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 70స్థానాలకు గాను ఒక్క చోట కూడా విజయం సాధించకపోవడం ఆ పార్టీ నాయకత్వానికి జీర్ణించుకోలేనిదిగా మారింది. అధికార ఆప్ 27చోట్ల, బీజేపీ 47చోట్ల విజయం దిశగా స్పష్టమైన ఆధిక్యతలో ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సహకారంతో కొంత పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఇప్పుడు ఢిల్లీలో వరుస పరాజయాలు ఎదుర్కోంది. జమ్మూ కశ్మీర్ లోనూ నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి విజయం సాధించినప్పటికి ఈ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ సాధించిన ఫలితాలు అక్కడ ఆ పార్టీకి ప్రతికూలంగానే మిగిలాయి.






