50 ఏళ్లుగా కాంగ్రెస్‌వి అబద్ధాలు, మోసాలే.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-11 06:36:24  IST  )

రాష్ట్రంలో గత 50 ఏళ్లుగా కాగ్రెస్ పార్టీవి అబద్ధాలు, మోసాలేనని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.

50 ఏళ్లుగా కాంగ్రెస్‌వి అబద్ధాలు, మోసాలే.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత 50 ఏళ్లుగా కాగ్రెస్ పార్టీవి అబద్ధాలు, మోసాలేనని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. జస్టిస్ పి చంద్రఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్‌ను కలిసేందుకు ఆయన ఇవాళ బీఆర్కే భవన్‌కు వెళ్లారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి అదనపు సమాచారాన్ని కమిషన్ చైర్మన్ జస్టిస్ పి చంద్రఘోష్‌కు అందజేశారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ల ప్రాజెక్టులు ఆరు సార్లు కేబినెట్ ఆమోదం పొందాయని తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీలోనూ మూడు సార్లు ఆమోదం పొందాయని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు కమిషన్‌కు అందజేశానని తెలిపారు. ఇంతకు మించిన వివరాలు కూడా ప్రభుత్వం వద్దే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం ఏమేం దాచిపెట్టిందో తమకు పూర్తి తెలుసని పేర్కొన్నారు. కాళేశ్వరంపై మా హయాంలో జరిగిన కేబినెట్ నోట్, డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం కావాలని చీఫ్ సెక్రటరీకి, జీఏడీ సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీలకు లేఖ రాశానని.. కానీ వారి నుంచి స్పందన రావడం లేదని హరీశ్‌రావు తెలిపారు

కృష్ణా నీళ్లలో 299 టీఎంసీల కేటాయింపు కాంగ్రెస్ పాపమే..

రాష్ట్రాలకు నీటి వినియోగాన్ని కేఆర్ఎంబీ చేస్తుందని, నీటి పంపకాన్ని ట్రైబ్యూనల్ చేస్తుందని అన్నారు. నీటి వినియోగం అనేది ఆ సంవత్సరానికి పరిమతమైన ఉంటుందని, నీటి పంపకం అనేది శాశ్వతమని విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించానలి అన్నారు. తెలంగాణకు 299 టీఎంసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సంతకాలు పెట్టిందని విషయం ప్రచారం కాంగ్రెస్ చేస్తోందని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి కాంగ్రస్ పాలకులు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఇదే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి చేతకాని నేతల వల్ల నాడు 299 టీఎంసీ నీరు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులు కేటాయించారని ఆరోపించారు.

ఒకవేళ నీళ్ల విషయంలో కేసీఆర్ శాశ్వత ఒప్పందం చేసి ఉంటే.. సెక్షన్-3 (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పున: పంపిణీ) గురించి రాష్ట్రం ఏర్పడిన 42 రోజే ఎందుకు ట్రైబ్యూనల్‌‌కు లేఖ రాశారో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. తెలంగాణలో ఉన్న 62 శాతం నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు కేటాయించారని.. ఇది తమ హక్కు అని కేసీఆర్ ట్రైబ్యూనల్‌ను విజ్ఞప్తి చేసింది వాస్తవం కాదా అని అన్నారు. కృష్ణా నీళ్లలో 299 టీఎంసీల కేటాయింపు కాంగ్రెస్ పాపమేనని ఆరోపించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే అని అన్నారు. గత 50 ఏళ్లుగా కాంగ్రెస్‌వి అబద్ధాలు, మోసాలేనని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఇచ్చింది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 50 ఏళ్లుగా చేసిన మోసాలకు కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని సెటైర్లు వేశారు.

Next Story