కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.! మంత్రి కోమటి రెడ్డి

by Geesa Chandu |   (  Updated:2024-08-15 16:17:26  IST  )

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.! మంత్రి కోమటి రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ప్రజాపాలనలో భాగంగా ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్ళను తీసుకొచ్చామని ఈ సందర్భంగా అన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సెల్బీసీ సొరంగాన్నిపూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అంతేగాక రాష్ట్రాన్ని గోదావరి, కృష్ణా జలాలతో సస్యశ్యామలం చేస్తుందన్నారు. మాది ప్రజల ప్రభుత్వమని, ఈ ప్రజాపాలనలో భాగంగానే సీతారామ ప్రాజెక్టు ను పూర్తి చేసి ప్రారంభించామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా మూడు లక్షల ఎకరాలకు నీరందుతుందని అన్నారు. తాము ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. తమ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని ఈ సందర్బంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.

Next Story