- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ‘సర్’పై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్, సీఈఓకు వినతిపత్రం సమర్పణ
కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు దొంగ ఓట్లతో గెలిచారని, అందుకే వాళ్లకు వణుకు పుడుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు దొంగ ఓట్లతో గెలిచారని, అందుకే వాళ్లకు వణుకు పుడుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ఓట్ల చోరీ జరిగిందని, దుర్మార్గంగా ఓట్ల ప్రక్రియ జరిగింది అనే దానికి బెంగాల్ ఎన్నికలు నిదర్శనమని ఆయన ఆరోపణలు గుప్పించారు. శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కార్యాలయంలో ఆయనతో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు పులిపాటి రాజేష్ కుమార్‌తో పాటు కమిటీ సభ్యులతో కూడిన కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణలో జరుగుతున్న ప్రీ ఎస్ఐఆర్ మ్యాపింగ్ లో భాగంగా ఎస్ఐఆర్ పై తమకున్న అభ్యంతరాలు, సూచనలతో కూడిన వినతిపత్రాన్ని సీఈసీకి ఇచ్చారు. తెలంగాణలో జరగనున్న సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై సుదర్శన్ రెడ్డితో కాంగ్రెస్ నేతలు అనేక అంశాలపైన చర్చించారు. పలు అంశాలను సీఈసీతో వారు వివరాలు తెలుసుకున్నారు. ఈ సమావేశం అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 8.2 కోట్ల ఓట్లు జోడిస్తే 5.90 లక్షల ఓట్లు తొలగించారని, బెంగాల్ లో రాజకీయ సమీకరణాలు మారి అధికారంలోకి రావాల్సిన పార్టీలో ఓడిపోయిందని ఆరోపించారు. బెంగాల్ లో 90 లక్షల ఓట్లు తొలగించి, 60 లక్షలు యాడ్ చేశారని, తెలంగాణలో వచ్చే రెండు ఏండ్లు ఎన్నికలు లేనందున ఎస్ఐఆర్ ప్రక్రియను ఏడాది జరపాలని సీఈసీకి చెప్పామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో జనగణన జరుగుతున్నందున ఎస్ఐఆర్ తో సిబ్బందిపైన భారం పడుతుందన్నారు.
సర్ పేరిట వారి ఓట్లు తొలగించే ప్రక్రియ!
2025 వరకు 3.35 కోట్ల ఓట్లు పెరిగినవని, ప్రస్తుతం జరుగుతున్న సెన్సెస్ ప్రక్రియలో ఎస్ఐఆర్ ని నిర్వహిస్తే సజావుగా జరగదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పేదవాని ఓటు తొలగిస్తే సరైన డాక్యుమెంట్ ఇవ్వలేరని, దీని వల్ల ఆధారాలను సమర్పించేందుకు వారికి 3 నెలల సమయం ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. మూడు సార్లు బీఎల్ఓ ఇంటికి వెళ్లి వేరిఫికేషన్ చేయాలని, కొన్ని చోట్లా బయట దేశస్థుల నెపంతో ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరి ఓట్లు వారే కాపాడుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సిటిజన్ షిప్ ప్రూఫ్ అడగకుండా నియమావళి చేయాలని, పాస్ పోర్ట్ అనేది 14లో ఒక్కటి మాత్రమే ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఓటర్లను ఇబ్బంది పెట్టకుండా ఎస్ఐఆర్ జరగాలని, బయట దేశస్తులు ఉన్నారనే నెపంతో న్యాయమైన ఓట్లు తొలగించే ప్రక్రియ కరెక్ట్ కాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్ పేరిట లౌకికవాదాన్ని నమ్ముకున్న వారి ఓట్లు తొలగించే ప్రక్రియ జరుగుతుందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 2002, 2022 ఓట్ల డాక్యుమెంట్లు రాజకీయ పార్టీలకు ఇవ్వాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, నవీన్ యాదవ్, శ్రీ గణేష్, కార్పొరేషన్ల చైర్మన్ లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.






