- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా?
పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటీషన్లపై సుప్రీం కోర్టు సీరియస్ అవడంతో..

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటీషన్లపై సుప్రీం కోర్టు సీరియస్ అవడంతో ఇప్పుడు స్పీకరు ఏ నిర్ణయం తీసుకుంటారునే ఉత్కంఠ నెలకొన్నది. కోర్టు విధించిన గడువులోపు ఎందరిపై వేటు వేస్తారు? ఎందరికి క్లీన్ చిట్ ఇస్తారు?అనే చర్చ జరుగుతున్నది. అయితే కోర్టు గడువులోపు స్పీకరు తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తున్నది.అయితే వేటు వేయడం కంటే పార్టీ ఫిరాయించినట్లు బలమైన ఆధారాలు ఉన్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం వల్ల హుందాగా ఉంటుందని అభిప్రాయంలో అధికార పార్టీ నేతలు ఉన్నారు.
ఇద్దరు రాజీనామా 8 మందికి క్లీన్ చీట్?
డిసెంబరు17 లోపు స్పీకరు తన నిర్ణయమాన్ని ప్రకటించాలి. ఆయన ముందు రెండు మార్గాలు ఉన్నట్లు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
1. పిటీషన్లను కొట్టేసి అందరికి క్లీన్ చీట్ ఇవ్వడం.
2. బలమైన సాక్ష్యాలు ఉన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం.
అయితే స్పీకరు అనర్హత వేటు వేస్తే అటు అధికార పార్టీకి, ఇటు పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు అవమానకరంగా ఉంటుంది. అందుకని పార్టీ ఫిరాయించినట్లుగా బలమైన ఆధారాలు ఉన్న దానం నాగేందర్, కడియం శ్రీహరిలతో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ అదిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చి, కోర్టుకు అఫిడవిట్ వేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుందని అలోచనలో ఏఐసీసీ నేతలు ఉన్నట్లు తెలుస్తున్నది.
త్వరలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు
సుప్రీం కోర్టు తీర్పుపై అటు స్పీకరు,ఇటు సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. రెండు మూడు సుప్రీం కోర్టులోని సీనియర్ న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే చాన్స్ఉంది. తాజాగా కోర్టు విధించిన గడువు నేపథ్యంలో స్పీకరు ముందు ఉన్న ప్రత్యామ్నయ మార్గాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అనర్హత పిటీషన్ల విచారణను మరింత వాయిదా వేయడం కుదరదని,గడవులోపు ఎదోఒక నిర్ణయం తీసుకోవాలని ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.






