Congress: లోకల్ ఎలక్షన్లపై కాంగ్రెస్ ఫోకస్.. పార్టీ బలోపేతానికి పక్కా స్కెచ్

by Kema Shiva Kumar |

లోకల్‌ బాడీ ఎన్నికలు, కాంగ్రెస్‌ ​పార్టీ బలోపేతంపైనే అధిష్టానం ఫోకస్ పెట్టింది.

Congress: లోకల్ ఎలక్షన్లపై కాంగ్రెస్ ఫోకస్.. పార్టీ బలోపేతానికి పక్కా స్కెచ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోకల్‌ బాడీ ఎన్నికలు, కాంగ్రెస్‌ ​పార్టీ బలోపేతంపైనే అధిష్టానం ఫోకస్ పెట్టింది. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనా దృష్టి సారించింది. ముఖ్యంగా ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌ ​వచ్చాక పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. గురువారం గాంధీ భవన్‌​లో హైదారబాదాద్​, సికింద్రాబాద్, నిజామాబాద్‌ ​లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణమాలతో పాటు పలు అంశాలపై లీడర్లను అడిగి తెలుసుకున్నారు. రివ్యూకు హాజరైన నేతలందరితో మీనాక్షి ​ వన్‌ ​టు వన్‌ సమాచారం ​తీసుకుంటున్నారు. అసలు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నది? ప్రభుత్వ కార్యక్రమాలు ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు.? అభివృద్ధి కార్యక్రమాలపై ఎందుకు నెగెటివిటీ వస్తోందన్న దానిపై కూడా ఆమె నేతలతో మాట్లాడి క్లారిటీ తీసుకుంటున్నారు.

సీనియర్లు, పార్టీకి లాయల్‌గా ఉన్న వారికి పదవులు

కచ్చితంగా సర్కారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి పాజిటివ్​‌గా తీసుకెళ్లాలని లీడర్లకు మీనాక్షి సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో నేతలందరూ కూడా ఇందుకోసం కష్టపడాలని, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్‌లో మంచి ఫలితాలు సాధించుకునేందుకు కృషి చేయాలన్నారు. పార్టీలో కష్టపడే వారికి పదవులు ఇచ్చి న్యాయం చేయాలని భావిస్తున్నారు. పార్టీకి లాయల్‌గా ఉన్నవారికి, సీనియర్లకు తొలుత పార్టీ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రానున్న ‘స్థానిక’ ఎన్నికలలో కాన్ఫిడెంట్‌​గా ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే పార్టీ బలోపేతం టార్గెట్‌​గా ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.

పార్టీ బలోపేతానికి గ్రౌండ్‌వర్క్

ఇప్పటి వరకు ఎనిమిది నియోజకవర్గాల సమీక్షలు పూర్తిగా నిర్వహించారు. గత నెలలో మల్కాజిగిరి, కరీంనగర్, మెదక్, పెద్దపల్లి, ఆదిలాబాద్‌ ​పార్లమెంటు సెగ్మెంట్ల రివ్యూలు నిర్వహించారు. గురువారం హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్‌ ​లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు జరిపారు. శుక్రవారం చేవెళ్ల, జహీరాబాద్ ​సెగ్మెంట్ల వారీగా రివ్యూ నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథన్, మంత్రులు దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్​ అభ్యర్థులు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ నేతలందరీ ఒపీనియన్స్ ​తీసుకున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నా.. వేరే పార్టీ నుంచి వచ్చినా నేతలు ఎవరైనా సరే సమన్వయంతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు.. వాటిలో బెటర్ రిజల్ట్స్​‌ సాధించాలని మీనాక్షి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో పాటుగా ​పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనికి సంబంధి ఒక గ్రౌండ్‌వర్క్ ​ప్రిపేర్​ చేసినట్టు తెలుస్తోంది.

సమన్వయంతో ముందుకెళ్లండి

కాంగ్రెస్​‌ పార్టీకి చెందిన అసంతృప్తి నేతలు కొందరు ఇన్‌చార్జి మీనాక్షిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము పార్టీని పవర్‌​లోకి తీసుకొచ్చేందుకు పోషించిన పాత్రపై ఆమెను కలిసి వివరిస్తున్నారు. పార్టీలో ఉన్న అసంతృప్తి, వర్గపోరు, వాళ్ల నేతల మధ్య ఉన్న సమన్వయ లోపం గురించి ఇన్‌చార్జికి చెప్పుకునేందుకు చాలామంది లీడర్లు డిసైడయి మీనాక్షిని కలిసేందుకు వస్తున్నారు. మొత్తానికి మీనాక్షి అందరితో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఏవైనా సమస్యలు ఉంటే సమన్వంతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు.

పార్టీ లైన్ దాటితే చర్యలు: మహేశ్ గౌడ్

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడంలో తాము చాలావరకు వెనుకబడి పోయామని పీసీసీ చీఫ్‌ ​మహేశ్‌ ​కుమార్‌ ​గౌడ్ తెలిపారు. సర్కారు సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రివ్యూ మీటింగ్‌లో ఆయన లీడర్లకు సూచించారు. కాంగ్రెస్​‌ పార్టీ బలోపేతానికి నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏడాదిన్నర పాలనలో దేశ చరిత్రలో నిలిచిపోయే కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రామ్‌లో తప్పక పాల్గొనాలని పీసీసీ చీఫ్‌ లీడర్లకు సూచించారు.

Next Story