- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం, ఫోన్‌ట్యాపింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు : మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల విషయంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కుమ్మక్కు కావడంతోనే రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తును సాగదీస్తుందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ప్రభాకర్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం,ఫోన్ ట్యాపింగ్ కేసుల విషయంలో కాంగ్రెస్, బిఆర్ ఎస్ కుమ్మక్కు కావడంతోనే రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తును సాగదీస్తుందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ప్రభాకర్ విమర్శించారు. గత కేసీఆర్ పాలనలో జరిగిన కుంభకోణాలపై అసెంబ్లీలో జరిగే చర్చలకు రావాలని రేవంత్ పిలువడం తప్ప కేసీఆర్ పై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తరువాత 10 ఏళ్లు కృష్ణ,గోదావరిపై ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో తెలంగాణకు నష్టం జరిగిందని, కృష్ణ, గోదావరి నీరు,నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతికత కేసీఆర్,హరీష్ రావుకు లేదని ద్వజమెత్తారు. ఫోన్లు ట్యాపింగ్ కేసు విచారణ పరిధిని తెలంగాణ ప్రభుత్వం తక్కువ చేసి చూపుతున్నట్లు కనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. అవినీతి, లిక్కర్ అమ్మకాలు, ప్రభుత్వ భూముల అమ్మకాలు, అరాచకాలు, ఆత్మహత్యల్లో తెలంగాణ రైజింగ్ లో ఉందని, బీర్ల, భూముల అమ్మకాల ద్వారా ఖజానా నింపుకోవాలని కాంగ్రెస్ చూస్తుందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపితేనే అసలు దోషులు బయటపడతారని, కాళేశ్వరం విషయం న్యాయ విచారణ, ఇంజనీర్లపై నెట్టే విషయం కాదని దీని అవినీతి విషయంలో సరైన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా బీజేపీ చూస్తుందని, అవినీతి అంశాలపై నేరుగా సుమోటోగా సీబీఐ దర్యాప్తు చేసే పరిస్థితి లేదన్నారు. సీబీఐతో దర్యాప్తు చేయాలని రాహుల్ గాంధీ, రేవంత్ డిమాండ్ చేశారని, ఇప్పడు రెండు పార్టీలు ఒకటి కావడంతో అవినీతి విచారణలు తేలడం లేదన్నారు. దీనికి విద్యుత్ కొనుగోళ్ల అవినీతి కేసు విచారణ నిదర్శనమన్నారు.






