యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ బోణీ.. తొలి సర్పంచ్ విజయం

by Gantepaka Srikanth |

యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ బోణీ.. తొలి సర్పంచ్ విజయం

యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ బోణీ.. తొలి సర్పంచ్ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల(Telangana Sarpanch Elections) ఫలితాలు వెలువడుతున్నాయి. యదాద్రి భువనగిరి జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ భోణి కొట్టింది. ఆలేరు మండలంలో సర్పంచుల స్థానాలపై ఉత్కంఠకు తెరపడింది. గురువారం జరిగిన ఎన్నికలో కందిగడ్డతండా గ్రామంలో ప్రజలు మాలోతు బోరిలాల్ నాయక్ వైపు మొగ్గు చూపారు. మొత్తం సర్పంచ్ బరిలో ముగ్గురు నిలవగా కాంగ్రెస్ బలపరిచిన మాలోతు బోరిలాల్ నాయక్ 14 ఓట్లు తేడాతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం నాలుగు గంటల్లోగా గ్రామాల్లో సర్పంచ్ ఎవరనేది తేలనుంది. అలాగే ఉపసర్పంచ్ ను ఈరోజు ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ తొలి విడతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ మొత్తం 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు.

Next Story