KTR:‘కొత్త డీజీపీ పొంగులేటికి శుభాకాంక్షలు’.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

by Jakkula.Mamatha |   (  Updated:2024-10-26 10:19:45  IST  )

సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నేతలు అరెస్ట్ అవడం పక్కా అని తెలిపారు.

KTR:‘కొత్త డీజీపీ పొంగులేటికి శుభాకాంక్షలు’.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
X

దిశ,వెబ్‌డెస్క్: సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నేతలు అరెస్ట్ అవడం పక్కా అని తెలిపారు. త్వరలోనే బాంబులు పేలతాయన్నారు. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన ప్రముఖులకు సంబంధించిన ఫైళ్లు సిద్ధం అయ్యాయన్నారు. కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళి(Diwali) లోపే టపాసులా పేలుతుందని మంత్రి పొంగులేటి అన్నారు. ఈనెల 26 లోపే కొన్ని బాంబులు పడతాయని మీడియా ప్రతినిధులతో మంత్రి పొంగులేటి ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా మరోసారి మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. పలు స్కాముల్లో నవంబర్ 1 నుంచి 8 వరకు కీలక నేతల అరెస్టులు జరుగుతాయన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ‘చూస్తుంటే తెలంగాణకు కొత్త డీజీపీ(DGP) వచ్చినట్లున్నారు. కొత్త రోల్ పోషిస్తున్న పొంగులేటి గారికి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. అటు నల్గొండలో కానిస్టేబుళ్లు చేస్తున్న నిరసనపైనా కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో పోలీసులే కేటీఆర్ రెబెల్స్‌గా మారారా అని కామెంట్స్ చేశారు.

Next Story