- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీహెచ్ఎంసీ VS హెచ్ఎండీఏ.. అనుమతులపై సందిగ్ధత
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సం స్థల విలీనం, 300 వార్డుల పునర్విభజన నేపథ్యంలో లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతుల..

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సం స్థల విలీనం, 300 వార్డుల పునర్విభజన నేపథ్యంలో లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతుల విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఇస్తుందా? హెచ్ఎండీఏనే ఇస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఒక సారి జీహెచ్ఎంసీలో ఏరియాలో విలీనమైన త ర్వాత అన్ని రకాల అనుమతులు జీహెచ్ ఎంసీ ఇస్తుందని అధికారులు చెబుతున్నా రు. డెవలప్‌మెంట్ రైట్స్ హెచ్ఎండీఏకు మాత్రమే ఉన్నాయని, దీనికి సంబంధించి న డెలిగేషన్ ఆఫ్ పవర్స్ జీహెచ్ఎంసీ ఇవ్వలేదని, అలాంటి ప్రతిపాదనలను రాలేదని హెచ్ఎండీఏ ఓ ఉన్నతాధికారి తెలిపారు. జీహెచ్ఎంసీ విస్తరణ నేపథ్యంలో హెచ్ఎం డీఏ, జీహెచ్ఎంసీ ప్లానింగ్ అధికారులకు స్పష్టత కరువైంది. అయితే దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు అధికారులు చెబుతున్నారు.
అనుమతులు ఇలా...
జీహెచ్ఎంసీలో విలీనం అయిన 27 మున్సిపాలిటీల్లో కమిషనర్ల ద్వారా 1000 చదరపు గజాల స్థలంలో రెసిడెన్షియల్ భవనానికి నాలుగు ఫ్లోర్లు, కమర్షియల్ బిల్డిం గ్‌కు ఐదు ఫ్లోర్లు అనుమతులు జారీచేస్తున్నారు. ఆపై భవన నిర్మాణాలను హెచ్ఎం డీఏ ద్వారా జారీచేస్తున్నారు. అయితే వీటి ని జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో వా టిని సర్కిళ్లుగా మార్చారు. దీంతో జీహెచ్ ఎంసీ పరిధిలో అయితే సర్కిల్ స్థాయిలో నాలుగు ఫ్లోర్లు, జోనల్ స్థాయిలో ఐదు ఫ్లో ర్లకు మాత్రమే అనుమతులివ్వడానికి అధికారాలు ఉన్నాయి. ఆపై నిర్మాణ అనుమతులన్నింటిని హెడ్ ఆఫీసు స్థాయిలో ఇస్తున్నారు.
డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఇవ్వలేదు : హెచ్ఎండీఏ
హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో పరిధిలో డెవలప్‌మెంట్ రైట్స్ హెచ్ఎండీఏ చట్టం ప్రకారం తమకే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ డెవలప్‌మెంట్‌కు జీహెచ్ఎంసీ నుంచి హెచ్ఎండీఏకు 2022 వరకు సుమారు రూ.12వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం చేసిన నేపథ్యంలో మున్సిపాలిటీలకు ఉన్న అధికారాలే జీహెచ్ఎంసీకే ఇచ్చే అవకాశముందని పలువురు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు జీహెచ్ఎంసీకి హెచ్ఎండీఏనే డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
విలీనమైనంకా మా ఏరియానే..: జీహెచ్ఎంసీ
జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేసిన నేపథ్యంలో బల్దియా పరిధి 2,052 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే అన్ని రకాల అనుమతలు జారీ చేస్తున్నారు. దీంతో ఏటా జీహెచ్ఎంసీకి సుమారు రూ.1500 కోట్ల ఆదాయం వస్తున్నది. అయితే విలీన మున్సిపాలిటీల్లోనూ అన్ని రకాల అనుమతులను జీహెచ్ఎంసీ జారీ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. కొత్తగా తమకు డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అక్కర్లేదని పలువురు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 27 సమీపంలోని పట్టణ స్థానిక సంస్థలను (యూఎల్‌బీలు) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేసిన నేపథ్యంలో, బిల్డ్‌నౌ యాప్‌ను సంబంధిత మార్పులతో నవీకరించడానికి చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.






