ఆర్టీసీ ఎండీ ఆదేశాలతో.. బస్సుల్లో ప్రారంభమైన కండక్టర్ల పలకరింపు

by Malleboina Mahesh |

తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమంతో మరోసారి ప్రజల ప్రశంసలు అందుకుంటుంది. ఎండీ గారి ఆదేశాల మేరకు బస్సుల్లో కండక్టర్ల పలకరింపు కార్యక్రమం ప్రారంభమైంది.

ఆర్టీసీ ఎండీ ఆదేశాలతో.. బస్సుల్లో ప్రారంభమైన కండక్టర్ల పలకరింపు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమంతో మరోసారి ప్రజల ప్రశంసలు అందుకుంటుంది. ఎండీ గారి ఆదేశాల మేరకు బస్సుల్లో కండక్టర్ల పలకరింపు కార్యక్రమం ప్రారంభమైంది. బండ్లగూడ డిపోలో మొదలైన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతి ట్రిప్ ప్రారంభంలో కండక్టర్లు ప్రయాణికులను వినమ్రంగా పలకరించి, బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ విధానం ప్రయాణికులకు సానుకూల అనుభవాన్ని కలిగిస్తూ.. RTC సేవల్లో కొత్త ఒరవడిని తీసుకువచ్చిందని అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంపై ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ప్రయాణికులు RTC ఈ ఆలోచనను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పంచుకుంటున్నారు. “ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఇంత స్నేహపూర్వకంగా మారడం సంతోషకరం” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం RTC బస్సుల్లో కండక్టర్ల పలకరింపు వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ చిన్న మార్పు ప్రయాణికుల మనసును గెలుచుకోవడమే కాకుండా, RTC ప్రతిష్టను కూడా మరింత పెంచుతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story