పెద్ద ధన్వాడ ఘటనపై NHRC లో ఫిర్యాదు

by Muthe.Rajitha |

జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్ద ధన్వాడ ఘటన పై NHRCలో ఫిర్యాదు చేసినట్లు, ఫిర్యాదు స్వీకరించి విచారణకు NHRC ఆదేశించిందని అడ్వకేట్ ఇమ్మనేని రామారావు గురువారం మీడియాకు వెల్లడించారు.

పెద్ద ధన్వాడ ఘటనపై NHRC లో ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్ద ధన్వాడ ఘటన పై NHRCలో ఫిర్యాదు చేసినట్లు, ఫిర్యాదు స్వీకరించి విచారణకు NHRC ఆదేశించిందని అడ్వకేట్ ఇమ్మనేని రామారావు గురువారం మీడియాకు వెల్లడించారు. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, లగచర్ల, దిలావర్పూర్, దామగుండం, కంచ గచ్చిబౌలి, చిన్న ధన్వాడ, పెద్ద ధన్వాడ, ప్రాంతాలలో పర్యావరణ విధ్వంసం జరుగుతుందని ఫిర్యాదులో పేర్కోన్నట్లు తెలిపారు. పెద్ద ధన్వాడ ప్రాంతంలో నిరసన తెలుపుతున్న రైతులపై అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా కొట్టారని, ఎథనాల్ పరిశ్రమ ఏర్పాటుని అడ్డుకోవడం రైతుల ప్రాధమిక హక్కు, మైనర్లపై కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నట్టు తెలిపారు.

పర్యావరణ ప్రభావం అంచనా చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరినట్లు తెలిపారు. రాజోలి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ జగదీశ్వర్ పై చర్యలు తీసుకోవాలని, గాయత్రీ ఇండస్ట్రీస్ అండ్ రేనివబుల్ ఫ్యూయల్స్ సంస్థపై చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చెయ్యాలని కోరినట్లు వెల్లడించారు. పోలీసుల దాడిలో గాయపడిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ పిటిషన్ లో పేర్కొన్నట్టు తెలిపారు.

Next Story