- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిపై సీల్డ్ కవర్ రిపోర్టు.. స్టేట్ చీఫ్ వద్దకు కమిటి నివేదిక
తెలంగాణ బీజేపీలో జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్ కొనసాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఎన్నికకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో పార్టీలు అభ్యర్థుల కోసం కసరత్తులో స్పీడ్ పెంచాయి. ఈ క్రమంలో ఇక్కడ అభ్యర్థి ఎంపిక కోసం నాయకులు, పార్టీ కేడర్ నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు నియమించిన త్రిసభ్య కమిటీ ఇవాళ తన నివేదికను రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు అందజేసింది. మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ సీనియర్ నేత, అడ్వొకేట్ కోమల ఆంజనేయులు సభ్యులుగా బీజేపీ ఈ కమిటీని నియమించింది.పార్టీ నేతల అభిప్రాయాలు సేకరించిన ఈ కమిటీ తాజాగా తన నివేదికను సీల్డ్ కవర్‍లో స్టేట్ చీఫ్‍కు అందజేసింది. కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేసులో జూటురు కీర్తి రెడ్డి, వీరపనేని పద్మ, లంకల దీపక్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేసిన కారణంగా ఆయనకే తిరిగి టికెట్ దక్కబోతోందా అనే టాక్ వినిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడు అనే పేరుతో పాటు ప్రస్తుతం ఆయన సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.
చివరి నిమిషంలో ట్విస్ట్ ఉండబోతోందా!:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో టీడీడీపీ ఉంటుందని అంతా భావించారు. కానీ నిన్న తెలంగాణ తెలుగుదేశం నేతలతో భేటీ అయిన చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కానీ చివరి నిమిషంలో ఏదైనా ట్విస్ట్ చోటు చేసుకుంటే నందమూరి సుహాసి సైతం బరిలో ఉండనున్నారనే చర్చ జరుగుతోంది. ఈ స్థానంలో పెద్ద సంఖ్యలో టీడీపీ మద్దతుదారులు సెటిలర్స్ ఓటర్లు ఉండటంతో ఈ వాదనను కొట్టివేయలేమనే టాక్ వినిపిస్తోంది. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ బై పోల్ కోసం కమలం శిబిరం ఎవరి అభ్యర్తిత్వాన్ని ఖరారు చేయనుంది అనేది అతి త్వరలోనే తేలనుంది.






