విత్తన చట్టం డ్రాఫ్ట్ సిద్దం చేస్తున్న కమిటీ

by Muthe.Rajitha |

సమగ్ర విత్తన చట్టానికి ముసాయిదా సిద్ధం చేసే పనిలో విత్తన చట్టం కమిటీ బిజీగా ఉంది.

విత్తన చట్టం డ్రాఫ్ట్ సిద్దం చేస్తున్న కమిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : సమగ్ర విత్తన చట్టానికి ముసాయిదా సిద్ధం చేసే పనిలో విత్తన చట్టం కమిటీ బిజీగా ఉంది. ఇప్పటి వరకు విత్తన కమిటీ వరంగల్, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, గద్వాల్, నిజామాబాద్ జిల్లాలో పర్యటించింది. ఆయా జిల్లాలోని గ్రామాల్లో రైతుల నుండి అభిప్రాయ సేకరణ చేపట్టింది. తరువాత విత్తన కంపెనీల ప్రతినిధులు, డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశమై సలహా, సూచనలు తీసుకుంది. గురువారం బషీర్ బాగ్ లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో విత్తన చట్టం ముసాయిదా కమిటీ సమావేశమైంది. కమిటీ కన్వీనర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, భూమి సునీల్, దొంతి నర్సింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎం.వి. నాగేశ్ కుమార్, శివ ప్రసాద్ తోపాటు వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ సుచరిత, డిప్యూటీ డైరెక్టర్ అనిత, ఏవో శ్రీనివాస్, రైతు కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోవిందు, ఏవో వెంకట హరిప్రసాద్ పాల్గొని విత్తన చట్టం డ్రాఫ్ట్ పై చర్చించారు.

ఇటీవలే విత్తన చట్టం రూపొందించే పనిలో భాగంగా హర్యానాకు స్టడీ టూర్ పై కమిటీ వెళ్లివచ్చింది. అక్కడ విత్తన చట్టం అమలవుతున్న తీరుపై, రైతుల అభిప్రాయాలు, అక్కడి చట్టంలోని అంశాలపై అధ్యయనం చేశారు. తెలంగాణాలో సమగ్రమైన విత్తన చట్టం తీసుకొచ్చే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ అంశాలు ఉండాలి. డ్రాఫ్ట్. ఎలా ప్రిపేర్ చేయాలనే అంశాలను చర్చించారు. వచ్చే సోమవారం మరోసారి కమిటీ సభ్యులు సమావేశమై డ్రాఫ్ట్ ప్రిపరేషన్ పై నిర్ణయం తీసుకోనున్నారు. అవసరమైతే విత్తన రంగంలో అనుభవం ఉన్న వారి అభిప్రాయాలు, సలహాలు సూచనలు తీసుకోవాలని అభిప్రాయ పడ్డారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టిందని వ్యవసాయశాఖ డైరెక్టర్ బి గోపి వివరించారు.


మాజీ ప్రధాని ఇందిరగాంధీ బీజేపీ నేతలు అసత్యం మానుకోవాలి : రైతు క‌మిష‌న్ చైర్మన్ కోదండ‌రెడ్డి,

మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై బీజేపీ నేత‌లు దుష్పచారాలు మానుకోవాలని రైతు కమిషన్ చైర్మన్​కోదండరెడ్డి హెచ్చరించారు. ఇందిరా గాంధీ ప‌రిపాల‌న, సంస్కర‌ణ‌ల‌తోని బ‌ల‌మైన నాయ‌కురాల‌ని ప్రపంచ‌మే గుర్తించిందన్నారు. ఒక సంద‌ర్భంలో అట‌ల్ బీహారీ వాజ్ పేయి ఇందిరాను దుర్గాదేవిగా కొనియాడారని గుర్తు చేశారు. ప్రస్తుతం బీజేపీ నేతలు ఇందిరా గాంధీపై అస‌త్యపు ప్రచారం చేయడం హాస్యస్పదంగా ఉందన్నారు. జ‌వ‌హార్ లాల్ నెహ్రు కేబినెట్ లో హోం మంత్రిగా ప‌నిచేసిన స‌ర్ధార్ వ‌ల్లభాయ్ ప‌టేల్ ను సొంతం చేసుకునే ప్రయ‌త్నం బిజెపి కుట్రలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీని బ‌ల‌హీనం చేసేందుకు బీజేపీ చేస్తున్న ఎత్తులను ప్రజా స్వామ్య వాదులు గుర్తించాలని కోరారు. జ‌య‌ప్రకాశ్ మూమెంట్ ఉత్తర భార‌త్ కే ప‌రిమితం, ద‌క్షిణ భార‌త్ లో ప్రభావం లేదన్నారు.

నాటి ప‌రిస్థితుల ఆధారంగా ఇందిరా గాంధీ ఎమ‌ర్జెన్సీ విధించాల్సి వ‌చ్చింది, జ‌న‌వ‌రి 18,1977లో స్వచ్చందంగా ఎమ‌ర్జెన్సీని ఎత్తివేసి తిరిగి ప్రజా క్షేత్రంలో వెళ్లిందన్నారు. ఎమ‌ర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ పార్టీ, ఇందిరా గాంధీ చరిష్మాను త‌గ్గించ‌లేరని హితువు పలికారు.మోడీ అన్ని వ్యవ‌స్థల‌ను గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. వ్యక్తుల‌పై వ్యవ‌స్థల‌పై దాడి చేస్తున్నారని, ఈడీని ప్రయోగిస్తూ అప్రక‌టిత ఎమ‌ర్జెన్సీ బీజేపీ నడిపిస్తోందన్నారు. ఆదానీ, అంబానీల‌కు హార్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో 800 ఎక‌రాల భూమిని ఇచ్చారని, దాంట్లో భార‌త‌దేశంలో ఆహార దాన్యాల‌ను నిల్వచేసుకోడానికి ఆదానీ, అంబానీ ప్రయ‌త్నాలు కొన‌సాగుతున్నాయని విమర్శించారు. దేశంలో ఆహార దాన్యాల నిల్వల‌కు వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ చ‌ట్టం తెస్తే దానిని మోడీ ప్రైవేట్ ప‌రం చేశారని మండిపడ్డారు. ఎమ‌ర్జెన్సీపై చౌక‌బారు రాజకీయాలు మానుకుని పాల‌న‌పై దృష్టి పెట్టాలని సూచించారు.

Next Story