HYD: టౌన్ ప్లానింగ్ అధికారులకు కమిషనర్ సృజన హెచ్చరిక

by Gantepaka Srikanth |

టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకూడదని, ఎవరైనా చేస్తే ఉపేక్షించేదిలేదని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) కమిషనర్ సృజన హెచ్చరించారు.

HYD: టౌన్ ప్లానింగ్ అధికారులకు కమిషనర్ సృజన హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకూడదని, ఎవరైనా చేస్తే ఉపేక్షించేదిలేదని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) కమిషనర్ సృజన హెచ్చరించారు. టౌన్ ప్లానింగ్ అంశాలపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ అనుమతుల జారీ, అనధికార నిర్మాణాలపై చర్యలు, కోర్టు కేసులు, జంక్షన్ అభివృద్ధి పనులు, ఆక్రమణల తొలగింపు, రోడ్ల విస్తరణ పనులు, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు, అలాగే ప్రజల ఫిర్యాదుల పరిష్కారం వంటి ముఖ్య అంశాలను చర్చించినట్టు సందర్భంగా కమిషనర్ పేర్కొన్నారు.

కమిషనర్ పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, సంబంధిత అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి విషయాలను సమయానికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు ఫీల్డ్ స్థాయిలో పర్యవేక్షణను బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన ప్రజల ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశానికి సీసీపీ వెంకన్న, సీపీ శైలజ, టౌన్ ప్లానింగ్ అధికారులు హాజరయ్యారు.

Next Story