నిరుద్యోగులకు కలెక్టర్ గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |

తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ప్రత్యేక చొరవ తీసుకొని ఏప్రిల్ 11న వరంగల్

నిరుద్యోగులకు కలెక్టర్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ప్రత్యేక చొరవ తీసుకొని ఏప్రిల్ 11న వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు టాస్క్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్య శారద(Collector Sathya Sarada) సూచించారు. జాబ్ మేళాకు సంబంధించిన సన్నాహాక సమావేశం గురువారం వరంగల్‌లోని ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు కంపెనీల ప్రతినిధులు, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, డీఆర్డీఓ జీఎం, జడ్పీ సీఈవో, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(Greater Warangal Municipal Corporation) డిప్యూటీ కమిషనర్ రామేశ్వర్, మెప్మా ప్రతినిధులు సుమారు 200 మంది వరకు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్(Collector ) మాట్లాడుతూ వరంగల్ జిల్లా యువతీ యువకులందరూ మెగా జాబ్ మేళా(Mega Job Mela) కార్యక్రమంలో పాల్గొని, తమ పేరును నమోదు చేసుకొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరారు. నిర్వాహకులు విడుదల చేసిన పోస్టర్‌లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు ఎన్ రోల్ చేసుకోని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 9:30 గంటల నుండి ప్రారంభం అవుతుందని కలెక్టర్ గుర్తు చేశారు.




Next Story