తెలంగాణ ప్రజలకు చలి గాలుల అలర్ట్.. ఆ 9 రోజులు డేంజర్

by Malleboina Mahesh |

వర్షాల బీభత్సం నుంచి బయటపడిన ప్రజలను ఇప్పుడు చలి తీవ్రత పట్టేస్తోంది. పగటిపూట వేడిగా ఉన్న వాతావరణం సాయంత్రం 5 గంటలు దాటిన వెంటనే చలి తీవ్రతగా పెరిగి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది.

తెలంగాణ ప్రజలకు చలి గాలుల అలర్ట్.. ఆ 9 రోజులు డేంజర్
X

దిశ, వెబ్‌డెస్క్: మొన్నటి వరకు రాష్ట్రాన్ని కుంభవృష్టి వర్షాలు ముంచెత్తగా, ఆ వర్షాల తగ్గుముఖం పట్టిన సంతోషం తెలంగాణ (Telangana) ప్రజలకు ఎక్కువ కాలం నిలవలేదు. వర్షాల బీభత్సం నుంచి బయటపడిన ప్రజలను ఇప్పుడు చలి తీవ్రత పట్టేస్తోంది. పగటిపూట వేడిగా ఉన్న వాతావరణం సాయంత్రం 5 గంటలు దాటిన వెంటనే చలి తీవ్రతగా పెరిగి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చలి గాలులతో (Cold winds) ప్రజలు సాయంత్రం ఆరు గంటలు దాటకముందే ఇళ్లకు చేరుకుంటున్నారు.

తాజా వాతావరణ నివేదికల ప్రకారం, నవంబర్‌ 11 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన చలి ప్రభావం కనిపించనుంది. ఇందులో నవంబర్‌ 13 నుంచి 17 వరకు చలి తీవ్రత గరిష్ట స్థాయిలో ఉండబోతోందని నిపుణులు హెచ్చరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌ స్థాయికి (9°C లోపు) పడిపోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు 11°C నుంచి 14°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో.. మోస్తరు చలి కొనసాగనుంది. అక్కడ ఉష్ణోగ్రతలు 14°C నుంచి 17°C మధ్య ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఇంత సుదీర్ఘ చలి వాతావరణం అరుదుగా కనిపిస్తుంది. ఈ సారి 8 నుంచి 10 రోజుల పాటు చలి ప్రభావం కొనసాగుతుందని నిపుణులు పేర్కొన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు వెచ్చని దుస్తులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Next Story