Meteorological department: తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత

by Gantepaka Srikanth |

తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్​జిల్లాలలో మంగళ, బుధ, గురువారం

Meteorological department: తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్​జిల్లాలలో మంగళ, బుధ, గురువారం ఈ మూడు రోజులలో అత్యల్ప ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేగాకుండా నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందని, రాబోయే 3 రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదే సందర్భంలో దక్షిణ, ఆగ్నేయ దిశల నుండి కూడా ఈ మూడు రోజులు చలి గాలులు కూడా వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Next Story