తెలంగాణను వణికించనున్న చలి.. 7 కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు

by Muthe.Rajitha |

రాష్ట్ర ప్రజలకు వాతావరణ నిపుణులు రెడ్ అలర్ట్ జారీ చేసారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు రాత్రి చలి తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది.

తెలంగాణను వణికించనున్న చలి.. 7 కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రజలకు వాతావరణ నిపుణులు రెడ్ అలర్ట్ జారీ చేసారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు రాత్రి చలి తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ఈనెలలో ఇదే అతి తీవ్రమైన చలి రాత్రి కానుందని నిపుణులు అంచనా వేశారు. ఇక రేపు ఎర్లీ మార్నింగ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోనున్నాయని తెలిపింది. ఇక పశ్చిమ తెలంగాణాలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అత్యవసరం అయితే తప్ప ప్రజలు రాత్రి పూట బయటికి రావొద్దని, బయటికి రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. గర్భిణీలు, వృద్ధులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని... అధిక చలి వలన జలుబు, దగ్గు, జ్వరం, సీజనల్ ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది.

Next Story