కిషన్ రెడ్డికి CM రేవంత్ సంచలన సవాల్.. ఐదు రోజుల డెడ్‌లైన్

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-04 15:41:50  IST  )

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాల్ విసిరారు.

కిషన్ రెడ్డికి CM రేవంత్ సంచలన సవాల్.. ఐదు రోజుల డెడ్‌లైన్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాల్ విసిరారు. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా రహమత్‌నగర్‌లో సీఎం రేవంత్ రోడ్‌షో చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో 30 వేల మెజార్టీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయడం లేదని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు బీజేపీ లొంగకపోతే తక్షణమే సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈనెల 11లోగా అంటే ఉప ఎన్నిక పోలింగ్ లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకపోతే జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌కు బీజేపీ మద్దతు ఇస్తున్నట్లే అని చెప్పారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావును, ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్‌ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఫార్ములా ఈరేసు పేరుతో రూ.50 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. విచారణ జరిపి గవర్నర్‌కు పంపితే ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని అన్నారు. ఇది లోపాయికారి ఒప్పందం కాదా? అని అడిగారు. ఇవన్నీ త్వరలో బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనానికి సంకేతాలు అని చెప్పారు. మరోవైపు అసలు జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ వాళ్లు ఏమని ఓట్లు అడుగుతున్నారు..? అని సీరియస్ అయ్యారు. పీజేఆర్‌ కుటుంబానికి బీఆర్ఎస్ చేసిన ద్రోహాన్ని ఇంకా ప్రజలు మర్చిపోలేదని అన్నారు. కాగా, జూబ్లీహిల్స్‌ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story