- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్ శాంతి ర్యాలీలో అసదుద్దీన్ ఒవైసీ.. కాంగ్రెస్ నిరసనకు సంఘీభావం
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) పెహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్‌లోని పీపుల్ ప్లాజా వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) పెహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్‌లోని పీపుల్ ప్లాజా వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్ఐఎమ్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ వద్దనున్న ఇందిరా గాంధీ విగ్రహం వరకూ ర్యాలీ చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో నిన్న ఢిల్లీలో ఏఐసీసీ నాయకులు సమావేశం అయ్యారు. బాధితులకు అండగా నిలబడాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ జరపాలని నిర్ణయించారు. అన్ని రాష్ట్రాల్లో, డివిజన్లలో శాంతి ర్యాలీ చేపట్టాలని.. ఇందులో నేతలు, కార్యకర్తలంతా పాల్గొనాలని ఏఐసీసీ(AICC) ప్రతినిధులు పిలుపునిచ్చారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆధ్వర్యంలో ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రకటించారు. మరోవైపు.. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనలో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా కీలక నేతలు పాల్గొన్నారు.






