ఆయన గతంలోనూ మావోయిస్టులతో చర్చలు జరిపారు.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

నక్సలిజాన్ని(Naxalism) తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతిభద్రతల అంశంగా పరిగణించదని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.

ఆయన గతంలోనూ మావోయిస్టులతో చర్చలు జరిపారు.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నక్సలిజాన్ని(Naxalism) తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతిభద్రతల అంశంగా పరిగణించదని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రిని ఆ నేతలు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

వినతి పత్రం అందచేసిన వారిలో శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా శాంతి చర్చల కమిటీ నేతలతో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతిభద్రతల అంశంగా పరిగణించదని ఆయన అన్నారు. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందని, ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని సీఎం తెలిపారు.

Next Story