- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేరు మారుస్తున్నాం.. 24 గంటల్లో జీవో తెస్తాం: CM రేవంత్ కీలక ప్రకటన
సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నిర్వహించిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి(Ramreddy Damodar Reddy) సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు.

దిశ, తుంగతుర్తి: శ్రీరాం సాగర్ రెండో దశకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 24 గంటల్లోగా దీనికి సంబంధించిన జీవో కూడా జారీ చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. అంతకుముందు రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీహెచ్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు ఎస్సారెస్పీ-2కి దామోదర్ రెడ్డి పేరు నామకరణం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఒక వినతిపత్రం కూడా అందజేశారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఆదివారం జరిగిన దామోదర్ రెడ్డి సంతాప సభకు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎస్సారెస్పీ-2 దశకు దామోదర్ రెడ్డి పేరు నామకరణం చేయడానికి అన్ని పక్షాలు కూడా మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సారెస్పీ 2 దశకు దామోదర్ రెడ్డి పేరు పెట్టడమే ఆయనకు ఇచ్చిన అసలైన నివాళులు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.అంతేకాదు ఆయన త్యాగాలు గౌరవాన్ని గుర్తిస్తాయని తెలిపారు.దామోదర్ రెడ్డి మృతి చెందడం ఎంతో బాధాకరమని సంతాపాన్ని ప్రకటించారు. తన జీవితమంతా ప్రజలకే అర్పించాడని కొనియాడారు. ముఖ్యంగా ఒకసారి రాజకీయాల్లో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారు ఆస్తులు కూడా పెట్టుకుంటే 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి తన వారసత్వం నుండి వచ్చిన ఆస్తులను ప్రజల కోసం కరగదీశాడని పేర్కొన్నారు. కక్షలు,కార్పన్యాలు,హత్య రాజకీయాలతో అట్టుడికి పోయిన తుంగతుర్తి ప్రాంతంలో వాటన్నింటినీ ఎదుర్కొంటూ కాంగ్రెస్ జెండాను నిలబెట్టాడని గుర్తు చేశారు. ఒకవైపు క్యాడర్ ను కాపాడుకుంటూనే మరోవైపు నీళ్లు లేక ఎడారిల మారిపోతూ ఫ్లోరైడ్ పట్టిపీడిస్తున్న తరుణంలో దామోదర్ రెడ్డి తుంగతుర్తి ప్రాంతానికి ఎస్సారెస్పీ నీళ్లు తేవడానికి ఉద్యమాలు సాగించాలని పేర్కొన్నారు.
కరీంనగర్,వరంగల్ జిల్లాలకు వస్తున్న నీళ్లు తమ జిల్లాకు తెచ్చుకొని సస్యశ్యామలం చేయాలనే దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగారని వివరించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎస్సారెస్పీ కాలువ కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని సాధించడంలో దామోదర్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు.ముఖ్యంగా రిజర్వేషన్ల పరంగా తుంగతుర్తి నియోజకవర్గం వదిలి సూర్యాపేటకు వెళ్లినప్పటికీ కూడా దామోదర్ రెడ్డి సొంత ప్రాంతాన్ని ఏనాడు మర్చిపోలేదని అన్నారు.ఖమ్మం జిల్లాలోని ఒకప్పటి సుజాతనగర్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్య వహించిన దామోదర్ రెడ్డి సోదరులు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి జోడిద్దుల్లాగా జెండాను మోసారని గుర్తు చేశారు. ఇది ఇలా ఉంటే దామోదర్ రెడ్డి మృతి వార్త పట్ల ఏఐసీసీ కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిందని తెలిపారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ సంతాప సందేశాన్ని పంపారని తెలిపారు. సోనియాతో పాటు రాహుల్ గాంధీ, నేత ఖర్గే తదితరులు దామోదర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటున్నట్లు హామీ ఇస్తున్నట్లుగా తనతో చెప్పమన్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.భవిష్యత్తు రాజకీయాల పరంగా కుమారుడు సర్వోత్తమ రెడ్డికి అండగా ఉంటున్నట్లు తెలిపారని ఆయన వివరించారు.






