CM Revanth Reddy : పదేళ్ల చీకట్లను పారదోలి.. అక్షర జ్యోతులు వెలుగుతున్నాయి : సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

తెలంగాణలోని ప్రభుత్వ బడు(Telangana Govt Schools)ల్లో భారీగా పెరుగుతున్న అడ్మిషన్లపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

CM Revanth Reddy : పదేళ్ల చీకట్లను పారదోలి.. అక్షర జ్యోతులు వెలుగుతున్నాయి : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ప్రభుత్వ బడు(Telangana Govt Schools)ల్లో భారీగా పెరుగుతున్న అడ్మిషన్లపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో పదేళ్ల చీకట్లను పారదోలి… ప్రభుత్వ పాఠశాలల్లో అక్షర జ్యోతులు వెలుగుతున్నాయని అన్నారు. పేద బిడ్డల చదువుల దేవాలయాలు అక్షర మంత్రోశ్ఛారణలతో పవిత్రతను సంతరించుకున్నాయని పేర్కొన్నారు. సర్కారు బడికి గత పాలకులు వేసిన తాళాలు బద్ధలవుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనిపిస్తోన్న ఈ గుణాత్మక మార్పు తెలంగాణ భవిష్యత్ గమనానికి సంకేతం అన్నారు.

ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ఇదే నిదర్శనమని, ఈ అక్షర యజ్ఞంలో చేతులు కలిపిన ప్రతి ఒక్కరికి నా అభినందనలని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు సీఎం తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ షేర్ చేశారు. దానితోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడు 3.68 లక్షల కొత్త అడ్మిషన్లు వచ్చాయని తెలిపే వార్తను కూడా పంచుకున్నారు.

Next Story