- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది తెలంగాణ యువత రక్తంలోనే ఉంది.. CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ యువత డ్రగ్స్ బారిన పడటం బాధాకరమైన విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ యువత డ్రగ్స్ బారిన పడటం బాధాకరమైన విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. గురువారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. విద్యార్థులు, ప్రజల ఉద్యమ ఫలితమే తెలంగాణ సాధన అని అన్నారు. అలాంటి తెలంగాణ యువత డ్రగ్స్(Drugs) బారిన పడినట్లు వస్తోన్న వార్తలు చూస్తుంటే తట్టుకోలేకపోతున్నామని ఆవేదన చెందారు. ఉద్యమం తెలంగాణ యువత రక్తంలోనే ఉందని.. ఇప్పుడు మళ్లీ డ్రగ్స్‌పై ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అమ్మితే వెన్నువిరిచేస్తామని హెచ్చరించాం.. చెప్పినట్లే చేస్తాం.. డ్రగ్స్ వాడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం అని మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
దాదాపు 50 ఏళ్ల కఠోర శ్రమతో మెగాస్టార్ చిరంజీవి ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తుచేశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా డ్రగ్స్‌వైపు కన్నెత్తి చూడకుండా చేశారు. చిరంజీవి లాగా అందరూ ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్లాలి. సినిమాల్లో, రాజకీయాల్లో, ప్రభుత్వ రంగాల్లో రాణించాలి.. రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రపంచంలో అగ్రభాగాన నిల్చోబెట్టాలని కోరారు. డ్రగ్స్‌కు బానిస అయితే.. కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుంది. ఏదీ సాధించలేం అని అన్నారు. దేశానికి యుద్ధ వీరులను అందించిన పంజాబ్ రాష్ట్రంలో యువత డ్రగ్స్‌కు బానిస కావడం పరిస్థితులు గందరగోళంగా మారాయని తెలిపారు. యువత ఎక్కువగా క్రీడల మీద దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్స్ వైపు దృష్టి మళ్లిందంటే.. కెరియర్ నాశనం అయినట్లే అని చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో ఏ విద్యా సంస్థలో అయినా డ్రగ్స్ దొరికితే కఠినాతి కఠినంగా శిక్షిస్తామని తీవ్ర హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు రామ్ చరణ్(Ram Charan), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) పాల్గొన్నారు.






