ట్రెసా బృందానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక రిక్వెస్ట్

by Bhoopathi Nagaiah |

ట్రెసా బృందానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని రెవెన్యూ శాఖ ఉద్యోగులందరికీ సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రజలకు సేవలందించడంలో అంకితభావం, బాధ్యతాయుత దృక్పథంతో పని చేయాలని సూచించారు. ఉద్యోగుల సంక్షేమం, సేవల నాణ్యత మరియు పరిపాలనలో సమర్థత కోసం నిరంతరం కృషి చేయాలని పేర్కొన్నారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం నూతన సంవత్సర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసింది. అంతకు ముందు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావులను బృందం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.

కార్యక్రమంలో ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే గౌతమ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులు పి.రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్లు ఆర్.మనోహర్ చక్రవర్తి, సెక్రటరీలు డి.వాణి, జాయింట్ సెక్రటరీలు బి.రాములు, మహ్మద్ షఫీయుద్దిన్, ఎం.రాజేశ్వర్ రెడ్డి, నజీమ్ ఖాన్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమణ్ రెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సుధాకర్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి రామకృష్ణారెడ్డి, సిద్ధిపేట జిల్లా కార్యదర్శి రాజేశం పాల్గొన్నారు. డిప్యూటీ కలెక్టర్ల సంఘం తరఫున అధ్యక్షులు వి.విక్టర్, ప్రధాన కార్యదర్శి కె. చంద్రకళ, కోశాధికారి చొల్లేటి వెంకటేశ్వర్లు, అసోసియేట్ అధ్యక్షులు కె. ఉపేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు విజయేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story