- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నా ఊరు, నా వాళ్ల మధ్యకు ఎప్పుడు వెళ్లినా ఆ అనుభూతే వేరు’.. CM రేవంత్ భావోద్వేగ ట్వీట్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లి(Kondareddypalli)లో పర్యటించారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లి(Kondareddypalli)లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో కుటుంబ సమేతంగా ఆంజనేయ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ ట్వీట్ పెట్టారు. బిడ్డకు తల్లి స్వాగతం పలికినట్టు కొండారెడ్డిపల్లి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంది. నా ఊరు, నా వాళ్ల మధ్యకు ఎప్పుడు వెళ్లినా అనిర్వచనీయ అనుభూతే. ఊరి పొలిమేరల్లో హనుమంతుడి ఆశీస్సులు ఆధ్యాత్మిక అనుభూతి. నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు’ అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.
బిడ్డకు తల్లి స్వాగతం పలికినట్టు…
— Revanth Reddy (@revanth_anumula) May 19, 2025
కొండారెడ్డి పల్లి ఆత్మీయంగా
ఆలింగనం చేసుకుంది…
నా ఊరు, నా వాళ్ల మధ్యకు
ఎప్పుడు వెళ్లినా…
అనిర్వచనీయ అనుభూతే.
ఊరి పొలిమేరల్లో…
హనుమంతుడి ఆశీస్సులు…
ఆధ్యాత్మిక అనుభూతి.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన
శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్,
ఉప… pic.twitter.com/7SxmRi3Ceu






