మరి కొద్దిసేపట్లో ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. కారణం ఇదే

by Muthe.Rajitha |

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ రాత్రి ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు.

మరి కొద్దిసేపట్లో ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. కారణం ఇదే
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ రాత్రి ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి రేపు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, పలు ప్రాజెక్టుల అనుమతి, నిధుల విడుదలపై చర్చించనున్నారు. జులై 24న ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలతో సమావేశమై తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే ఫలితాలను సమర్పించనున్నారు.

బీసీలకు 42% రిజర్వేషన్‌ అమలుపై వివరణ ఇవ్వనున్నారు. అదే రోజు ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ ఎంపీలకు కులగణన(Cast Census)పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టబద్ధతపై అమలుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎంపీలను కోరనున్నారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు.

Next Story