- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడంగల్ లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
by Ramesh Naini |
ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు వేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు వేశారు. స్వయంగా ఊరు వెళ్లి కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, మొత్తం 1439 మంది ఓటర్ల కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం రెండు గంటలకు 89 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు.
Next Story






