- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్యాంక్ బండ్ వద్ద గణనాథుల నిమజ్జనం.. స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణేష్ నిమజ్జనాలను స్వయంగా వీక్షించారు. క్రేన్ నంబర్ 4 నుంచి నిమజ్జనాలను ఆయన పరిశీలించారు.

దిశ, వెబ్‌డెస్క్:హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద గణనాథుల నిమజ్జనం (Hyderabad Ganesh Nimajjanam) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జనం పూర్తవ్వగా.. భక్తులు బైబై గణేశా అంటూ గణనాథుడికి తుది వీడ్కోలు పలికారు. మరోవైపు బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర (Balapur Ganesh Shobhayatra) కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గణేష్ నిమజ్జనాలను స్వయంగా తిలకించేందుకు సామాన్యుడిలా ఎన్టీఆర్ మార్గ్ (NTR Marg) కు చేరుకున్నారు. కాన్వాయ్ లేకుండా పరిమిత వాహనాలతో ట్యాంక్ బండ్ కు వెళ్లిన సీఎం.. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనాలను పరిశీలించారు. అక్కడే ఉన్న జీహెచ్ఎంసీ (GHMC) అధికారులతో మాట్లాడి నిమజ్జనాల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం జరగాల్సి ఉంది? బందోబస్త్ వివరాలపై ఆరా తీశారు. సీఎం రాకతో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. సీఎంతో కరచాలనం చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు.






