- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోకాలికి శస్త్ర చికిత్స.. జానారెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మోకాలి శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న జానారెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని సీఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న జానారెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక మంత్రి పదవులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా పార్టీలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు జానారెడ్డి త్వరలోనే యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.
Next Story






