CM Revanth: నా జీవితంలో మరచిపోలేని మైలురాయి.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

జూలై 7 నా జీవితంలో మరచిపోలేని మైలురాయి.. అని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.

CM Revanth: నా జీవితంలో మరచిపోలేని మైలురాయి.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (TPCC Cheif) టీపీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇదే రోజున బాధ్యతలు స్వీకరించారు. 07-07-2021లో 4 సంవత్సరాల క్రితం పీసీసీ అధ్యక్షుడిగా చార్జ్ తీసుకున్నారు. నాటి జ్ఞాపకాలతో సీఎం రేవంత్‌రెడ్డి చీఫ్‌గా బాధ్యతలు తసుకుంటున్న ఫోటోను ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. నియంతృత్వాన్ని సవాల్ చేసి.. నిర్భంధాన్ని ప్రశ్నించి, స్వేచ్ఛ కోసం యుద్ధం ప్రకటించిన మరిచిపోలేని సందర్భమని పేర్కొన్నారు. నేటి ప్రజా పాలనకు నాడు సంతకం చేసిన సంకల్పం.. కాంగ్రెస్ (Congress) అగ్రనేతలు సోనియాగాంధీ (Sonia Gandhi) ఆశీస్సులు, రాహుల్ గాంధీ (Rahul Gandhi) అండతో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జూలై 7 జీవితంలో మరచిపోలేని మైలురాయి.. అంటూ నాటి ఫోటో ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇది చారిత్రాత్మకమైన రోజు అని, ఈ రోజు ఒక నాయకుడి కంటే గొప్ప ప్రజానాయకుడి ఆవిర్భావ దినం అని ఓ నెటిజన్ కామెంట్ ఆసక్తికరంగా మారింది. రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజానాయకుడిగా రేవంత్ అన్న నిలిచారని మరో యూజర్ ఆసక్తికర కామెంట్ చేశారు.

Next Story