డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన

by Malleboina Mahesh |

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో భారీ స్థాయిలో ప్రజా పాలన ఉత్సవాలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.

డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో భారీ స్థాయిలో ప్రజా పాలన ఉత్సవాలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి మొదలుకానున్న ఈ పర్యటన డిసెంబర్ 7 వరకు కొనసాగనుంది.పర్యటనలో భాగంగా వివిధ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించడంతో పాటు ప్రజా సభలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ రెండు సంవత్సరాల పాలనను ప్రజలకు వివరించడం, కొనసాగుతున్న సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం గా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 8 మరియు 9 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ అంతర్జాతీయ సమ్మిట్‌లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047ని విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Next Story