CM Revanth Reddy: అసదుద్దీన్ ఓవైసీ థ్యాంక్స్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

by Ramesh Naini |

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మద్దతుకి సీఎం రేవంత్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు.

CM Revanth Reddy: అసదుద్దీన్ ఓవైసీ థ్యాంక్స్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) మద్దతు తెలిపింది. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఎంఐఎం మద్దతు ఇవ్వాలని (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డి కోరారని పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) తెలిపారు. సహచర హైదరాబాదీ, న్యాయనిపుణులు సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ఓవైసీ నిన్న ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ మద్దతుకి సీఎం రేవంత్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు. జాతీయ ప్రయోజనాల ఉమ్మడి ఉద్దేశంతో జస్టి సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపినందుకు అసదుద్దీన్ ఓవైసీకి ధన్యవాదాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాగా, సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌పై ప్రతిపక్ష అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy)ని ప్రకటించిన విషయం విదితమే.

Next Story