- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహా న్యూస్ పై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ !
తెలంగాణ రాష్ట్రంలో మహా న్యూస్ కార్యాలయంపై ( Maha News) జరిగిన దాడి గురించే చర్చ జరుగుతోంది. అయితే ఈ సంఘటనపై

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో మహా న్యూస్ కార్యాలయంపై ( Maha News) జరిగిన దాడి గురించే చర్చ జరుగుతోంది. అయితే ఈ సంఘటనపై తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth reddy) కూడా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. మహా టీవీ కార్యాలయం పై దాడి హేయమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే... ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పోస్ట్ పెట్టారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమర్ధనీయం కాదని.. చురకలు అంటించారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారని.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఇలా ఉండగా ఈ సంఘటన నేపథ్యంలో నేరుగా మహా న్యూస్ కార్యాలయానికి భట్టి విక్రమార్క వెళ్లారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. మహా న్యూస్ ఆఫీస్ పై దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు.
మీడియాలో వచ్చే కథనాలు అలాగే ప్రసారాలపై అభ్యంతరాలు ఉంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చని గుర్తు చేశారు. కానీ ఇలా దాడి చేయడం ప్రజాస్వామ్య విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరానికి పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుంటే.. కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం కరెక్ట్ కాదని నిప్పులు చెరిగారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారని... నిందితులపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.






