- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్.. అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశాలు
by Gantepaka Srikanth |
తెలంగాణలో గిగ్ వర్కర్ల(Gig Workers) సంక్షేమం కోసం ప్రతిపాదిత పాలసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గిగ్ వర్కర్ల(Gig Workers) సంక్షేమం కోసం ప్రతిపాదిత పాలసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, వారికి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పించే విధంగా పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతిపాదిత పాలసీపై ముఖ్యమంత్రి మంత్రి వివేక్ వెంకటస్వామి(Vivek Venkatswamy)తో కలిసి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. పాలసీ గురించి అధికారులు వివరించినప్పుడు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ఆ బోర్డుకు ప్రభుత్వ ప్రాతినిథ్యం వహించేలా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. గిగ్ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్ లైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం ట్వీట్
Next Story






