- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మాట YSR పదే పదే చెప్పేవారు: CM రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం విషయంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొనియాడారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం విషయంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొనియాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, జలయజ్ఞం, ఔటర్ రింగు రోడ్డు, పింఛన్ల పెంపు వంటి కార్యక్రమాలతో ఉమ్మడి రాష్ట్ర ప్రజల్లో వై.ఎస్. శాశ్వతంగా నిలిచిపోయారని సీఎం పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చెప్పేవారని.. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.
ఆ తర్వాత మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానమంత్రులుగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకునిగా పలు విధాన నిర్ణయాల్లో ప్రభుత్వానికి అండగా చంద్రశేఖర్ నిలిచారని సీఎం గుర్తు చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ రాణించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.






