CM Revanth Reddy : ఇంద్రవెల్లి అమరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

by Muthe.Rajitha |

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇంద్రవెల్లి అమరవీరులకు(Indravelli Martyrs) ఘన నివాళులు అర్పించారు.

CM Revanth Reddy : ఇంద్రవెల్లి అమరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇంద్రవెల్లి అమరవీరులకు(Indravelli Martyrs) ఘన నివాళులు అర్పించారు. అడవి బిడ్డల త్యాగలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పేర్కొన్నారు. 4 దశాబ్దాల నిర్భంధం బద్దలయ్యిన రోజు ఇదని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం అడవి బిడ్డలు స్వేచ్ఛగా రెక్కలు విచ్చుకుంటున్నారని తెలియజేశారు. నాకు అండగా నిలిచి, దండుగా కదిలిన అడవి బిడ్డలకు తాను ఎల్లప్పుడూ తోడు ఉంటానని హామీ ఇచ్చారు. తన విజయం కోసం ఇంద్రవెల్లి కొండల్లో దండుగా కదిలిన ఆదివాసీలకు అన్నగా, ఆత్మీయులకు దన్నుగా ఉండాలని తాను నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. "జల్.. జంగల్.. జమీన్.."(Jal Jangal Jameen) అంటూ హక్కుల కోసం అసువులు బాసిన అడవి బిడ్డల పోరాటం సదా స్పూర్తిదాయకం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story