- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియన్ మార్కెట్ కు గేట్ వే గా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ రోడ్లకు కార్పొరేట్ కంపెనీల పేర్లు పెట్టబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ప్రపంచ పెట్టుబడిదారులకు తెలంగాణ రాష్ట్రంలో అద్భుత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‍తో పాటు ఇతర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ అక్కడ జరిగిన యూఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (United States-India Strategic Partnership Forum) పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్ధగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి ఈ సమావేశంలో భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. తాను భారతదేశంలోనే అత్యంత యువ, ఉత్సాహవంతమైన విజయవంతమైన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పారు. తెలంగాణ భౌగోళికంగా దేశం మధ్యలో ఉండటమే కాకుండా ఇక్కడ ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు లేవని అద్భుతమైన వాతావరణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఇండియన్ మార్కెట్ కు గేట్ వే లాంటిందని ఇప్పుడు హైదరాబాద్ గ్లోబల్ కంపెనీలుక ప్రధాన కేంద్రంగా ఎదిగిందన్నారు. అందువల్ల తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ రోడ్లకు కార్పొరేట్ కంపెనీల పేర్లు:
గత 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ జీవన ప్రమాణాలతో హైదరాబాద్‍ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దిందనని ప్రధానంగా మహిళల ఆర్థిక సాధికారత, ఉత్తమ్ విద్య, నైపుణ్యాభివృద్ధిపై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని ప్రముఖ విద్యా సంస్థలను ఇక్కడికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి.. హార్వర్డ్, స్టాన్ ఫర్డ్, ఆక్స్ ఫర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను ఏర్పాటు చేస్తే గ్లోబల్ సౌత్ విద్యార్థులు తక్కువ ఖర్చుతో సులభ వీసాతో విద్యను పొందగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ దేశంలోనే అత్యంత ఆధునిక నగరంగా రూపుదిద్దుకుంటోందని మూసీ నది పునరుద్ధరణ తర్వాత లండన్, టోక్యో, దుబాయ్, సియోల్ నగరాల తరహాలో అభివృద్ధి చెందుతుందని ఇది నైట్ ఎకానమీకి పెద్ద ఊతం ఇవ్వబోతోందని చెప్పారు. డ్రై పోర్ట్, హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఆర్ఆర్ఆర్-ఓఆర్ఆర్ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. చైనా+1 కు ప్రత్యామ్నాయంగా ప్రపంచానికి సమాధానం ఇవ్వగలిగే రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఇకపై హైదరాబాద్ లోని ముఖ్యమైన రోడ్లకు కార్పొరేట్ కంపెనీల పేర్లు పెట్టబోతున్నామని సీఎం చెప్పారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకుల పేర్లతో రోడ్లు ఉండగా ఇకపై గూగుల్, మెటా టీసీఎస్, ఇన్ఫోసిస్ వీధులు చూడబోతున్నామని తెలిపారు.
తెలంగాణ రైజింగ్ కు మా మద్దతు: యూఎస్ఐఎస్‍పీఎఫ్
యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం (USISPF) అధ్యక్షుడు, సీఈఓ డా.ముఖేష్ అఘీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పిలుపు మేరకు డిసెంబర్ 8,9న తెలంగాణలో జరగబోయే తెలంగాణ రైజింగ్ కు (TelanganaRising) పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. USISPF సభ్యుల్లో ఎక్కువ మంది ఈ ఈవెంట్ లో పాల్గొంటామని చెప్పారు. సిస్కో మాజీ సీఈఓ, టెక్ దిగ్గజం జాన్ చాంబర్స్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి దృష్టి ధైర్యవంతమైనది, స్పష్టమైనది, చాలా సాధ్యమైనది అని వ్యాఖ్యానించారు. తన పూర్తి మద్దతును సీఎంకు ప్రకటించారు. రేవంత్ రెడ్డి వివరించిన గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులు, వాటి సామాజిక ప్రభావం చాలా ప్రభావవంతంగా ఉన్నాయన్నారు.
READ MORE ....






