CM Revanth Reddy: కుల గణనలో ఎలాంటి పొరపాట్లు జరగలే.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

కుల గణనలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

CM Revanth Reddy: కుల గణనలో ఎలాంటి పొరపాట్లు జరగలే.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కుల గణనలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ అసెంబ్లీ (Assembly)లో కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కులగణనలో తప్పుడు తడకగా ఉందంటూ విపక్షాలు ఆరోపించాయని ఆ విషయంలో వాస్తవం లేదని అన్నారు. సర్వేకు ముందు మలు రాష్ట్రాల్లో అధికారులు పర్యటించారని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో లోటుపాట్లను గుర్తించి సరి చేశామని సభకు తెలిపారు. సర్వేపై ఏకంగా 12 సార్లు సమీక్ష నిర్వహించి పకడ్బందీగా రూపొందించామని అన్నారు. ప్రతి 150 ఇళ్లకు ఒక బ్లాక్ గుర్తించి సర్వే చేపట్టి గుర్తు చేశామని తెలిపారు. అన్ని శాఖల సిబ్బందిని సర్వేలో భాగస్వాములను చేశామని అన్నారు. ముందుకు స్టిక్కర్లు అంటించి సర్వే చేయాల్సిన ఇళ్లను గుర్తించామని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొనే సిబ్బందికి అనేక సార్లు శిక్షణను ఇచ్చామని అన్నారు. సమాజ అభివృద్ధికి ఈ సర్వే ఓ మార్గదర్శిగా మారుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story