కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

by Ajay Maddhiboyina |

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో సీఎం చర్చించారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
X

దిశ‌, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో సీఎం చర్చించారు. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన RRR ఉత్తర భాగానికి వీలయినంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. NH765లోని హైదరాబాద్- శ్రీశైలం సెక్షన్‌కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని కోరారు.

హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ను వీలైనంత త్వరగా మంజూరు చేయాలన్నారు. ORR, RRRలను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను సీఎం కేంద్రమంత్రికి వివరించారు. హైదరాబాద్-డిండి-మన్ననూర్, హైదరాబాద్-మంచిర్యాల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, ఓఆర్ఆర్ నుంచి మన్నెగూడ వరకు రేడియల్ రోడ్డు అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఇదిలా ఉంటే నితిన్ గట్కారీ హైదరాబాద్ లోని లింగపల్లి ఫ్లైఓవర్‌ను నేడు ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ తో ట్రాఫిక్ కష్టాలు కొంతవరకు తీరనున్నాయి.

Next Story